యుద్ధం ఏ దేశానికి ఆప్షన్ కాదుః పాక్ ప్రధాని

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని వెల్లడి

Pakistan and India can’t afford another war, says PM Shehbaz

కాబూల్‌ః పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల బృందంతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి భారత్ తో చర్చల విషయంపై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా జమ్మూకశ్మీర్ సమస్యను పరిష్కరించుకున్నప్పుడే దక్షిణాసియాలో సుస్థిర శాంతి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘మేము భారత్ తో శాశ్వత శాంతి స్థాపన కోరుకుంటున్నాం. అది కూడా చర్చల ద్వారానే. యుద్ధం ఏ దేశానికి ఆప్షన్ కాదు’’ అని షరీఫ్ పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థికం, ప్రజల స్థితిగతులను మెరుగుపరచడంలో రెండు దేశాల మధ్య పోటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ దురాక్రమణదారు కాదంటూ, తమ అణ్వాయుధాలు, సైన్యం అన్నవి కేవలం తమను రక్షించుకోవడానికేనన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/