మరో కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్..ప్రయాణికులు ఫుల్ హ్యాపీ

ఎప్పుడు ఎక్కడ చూసిన యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపు పక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల ఆయన కొన్ని బస్టాండ్లలో వివిధ సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్‌పాస్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలను ప్రారంభించిన సమయంలోనే ఆయన ప్రయాణికులు ఈ సర్వీసులపై తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో జూబ్లీ బస్ స్టేషన్‌లోనూ యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ప్రకటించారు. పార్సిల్, కార్గో బుకింగ్, బస్ పాస్ కౌంటర్లలో ఈ సేవలను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. ఈ నిర్ణయం తో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.