రోజ్‌ కొబ్బరి లడ్డూ

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Rose Coconut Laddu

కావలసినవి :
ఎండుకొబ్బరిపొడి: 2 కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌ : అరకప్పు రోజ్‌సిరప్‌ : టీ స్పూను, యాలకులపొడి : అరటీస్పూను, నెయ్యి : 3 టీ స్పూన్లు.

తయారుచేసే విధానం :
పాన్‌లో నెయ్యివేసి వేడిగా అయ్యాక కొబ్బరిపొడి, కండెన్స్‌డ్‌ మిల్క్‌, రోజ్‌ సిరస్‌, యాలకులపొడి వేసి కలుపుతూ చిన్నమంట మీద ఉండికంచాలి.

మిశ్రమం మొత్తం ఉడికి ముద్దగా అయ్యాక దించి చల్లారనివ్వాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే చిన్నచిన్న లడ్డూల్లా చేసుకుని కొబ్బరి పొడిలో దొర్లించి ఆరనివ్వాలి.

పూర్తిగా చల్లారాక ఫ్రీజ్‌లో పెడితే త్వరగాగట్టిపడతాయి. లేదా గాలికి పూర్తిగా అరాక డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి.

తాటి బెల్లం లడ్డూలు

palm jaggery laddu
palm jaggery laddu

కావాల్సినవి :

తాటిబెల్లం-కప్పు, పచ్చికొబ్బరి తురుము-రెండు కప్పులు, నీళ్లు-రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల
పొడి-టీ స్పూన్‌

తయారీ :
గిన్నెలో తాటి బెల్లం, నీళ్లు తీసుకుని, స్టవ్‌ మీద పెట్టి బెల్లం కరిగించాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలపాటు ఎక్కువ మంట మీద చిక్కటి పాకం వచ్చేంత వరకూ ఉంచాలి. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడికించాలి. మిశ్రమం గట్టిపడే వరకూ కలుపుతూ ఉండాలి. కాస్త చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/