ఫ్రాన్స్‌లో మరో దారుణం

మహిళ తల నరికిన దుండగుడు

ఫ్రాన్స్‌లో మరో దారుణం
3 dead in ‘terrorist’ knife attack in French church

నైస్‌: పారిస్‌ నగరంలోని ఓ చర్చిలో దుండగుడు ఓ మహిళ తలను నరికివేశాడు. మరో ఇద్దరిని దారుణంగా హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణాలకు పాల్పడే సమయంలో అతడు ‘అల్లాహు అక్బర్‌’ అని అరిచినట్లు చెప్పారు. ఇది ఉగ్రదాడేనని నైస్‌ నగర మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్ట్రోసి వెల్లడించారు. దుండుగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ట్యునీషియాకు చెందినవాడిగా తెలుస్తున్నది. ఫ్రాన్స్‌లో గత రెండు నెలల్లోనే చోటుచేసుకున్న మూడో ఉగ్రదాడి ఇది. ఈ నేపథ్యంలో ప్రాన్స్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. విద్యార్థులకు ఇస్లాం ప్రవక్త కార్టూన్లను చూపాడనే కారణంతో ఈ నెల ప్రారంభంలో ఒక ఉపాధ్యయుడిని దుండగుడు తలనరికి చంపిన సంగతి తెలిసిందే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/