ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ను మరింత వెనక్కి నెట్టిన జక్కన్న

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను తొలుత జూలై 30 2020లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌ను 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా రిలీజ్‌ను 2021 వేసవికి వాయిదా వేశారు చిత్ర యూనిట్. కానీ ఇంకా సినిమా షూటింగ్ చాలానే మిగిలి ఉండటంతో ఈ సినిమా రిలీజ్‌ను ఇప్పుడు ఏకంగా దసరాకు మార్చారు.

అయితే ఈసారైనా ఎలాంటి వాయిదా లేకుండా సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తారా లేదా అని ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్‌ను వాయిదే వేసిన ఈ సినిమా ఇకనైనా వేసవి కానుకగా రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమా 2021 దసరా కానుకగా రిలీజ్ అవుతుందో లేదో తెలియాలంటే అప్పటివరకు ఆగాల్సిందే.