రౌడీ హీరో తమ్ముడు మూవీ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో భవ్య క్రియేషన్స్ సినిమా

Anand Devarakonda
Anand Devarakonda

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

గత ఏడాది విడుదలైన ట్రాజిక్ పీరియాడిక్ లవ్ డ్రామా దొరసాని మూవీలో ఆనంద్ దేవరకొండ నటించారు. ఆ మూవీతో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా వెండితెరకు పరిచయం కావడం విశేషం.

ఆ చిత్ర ఫలితం ఎలా ఉన్నా ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ యంగ్ ఫెలో ఓ కొత్త మూవీ ప్రకటించారు.

భవ్య క్రియేషన్స్ ఆనంద్ దేవరకొండతో మూవీ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.

వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.

స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/