పాన్ ఇండియా మూవీ

ఆది సాయికుమార్‌ రెడీ

Aadi Sai kumar New Movie
Aadi Sai kumar New Movie

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ క్ర‌మంలో యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్.

ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండ‌టం విశేషం.

హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం త‌న‌కు పెద్ద బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్క‌బోతున్న ఈ చిత్రంలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది.

య‌స్.వి.ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.య‌‌స్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న‌ ఈ చిత్రాన్ని య‌స్‌.వి.ఆర్ నిర్మిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/