ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ గ్యాంగ్‌ హైదరాబాద్‌లో అరెస్టు

చోరీ బంగారం విలువ రూ. 7.5 కోట్లు

Robbery gang arrested in Hyderabad
Robbery gang arrested in Hyderabad

Hyderabad: తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ శాఖలో పట్టపగలే దోపిడీకి పాల్పడిన  దొంగలు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు.   

బంగారాన్ని దొంగిలించిన గ్యాంగ్‌ హైదరాబాద్‌ విూదుగా జార్ఖండ్‌, బీహార్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. తమిళనాడు నుంచి జాతీయ రహదారి 44పై వెళ్తున్న ఆ గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌ శివార్లలో  ఎన్‌హెచ్‌ 44పై సైబరాబాద్‌ పోలీసులు బంగారం చోరీ గ్యాంగ్‌ను శనివారం అరెస్టు చేశారు. బంగారం విలువ రూ. 7.5 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/