ఆచార్య నాగార్జున వర్సిటీలో వెజిటబుల్‌ గార్డెన్‌

పండించే కూరగాయలు హాస్టల్ విద్యార్థులకు వినియోగం

ఆచార్య నాగార్జున వర్సిటీలో వెజిటబుల్‌ గార్డెన్‌
VC Rajasekhar launching the Vegetable Garden

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా వసతి గృహాల్లో వెజిటబుల్‌ గార్డెన్‌ను శనివారం వైస్‌చాన్సలర్‌ ఆచార్య రాజశేఖర్‌ ప్రారంభించారు.

సుమారు 3ఎకరాల విస్తీర్ణంలో ఈ గార్డెన్‌ ఉంటుందని , ఇందులో కూరగాయలు, ఆకుకూరలు పండించి విద్యార్థుల వసతిగృహాలకు పంపిణీ చేస్తామన్నారు.

యూనివర్సిటీ రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సిద్ధయ్య, ఇంజనీర్‌ కుమార్‌రాజా, బ్యూటిఫికేషన్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ పి.సత్యన్నారాయణ రాజు తదితరులు ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/