కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Road accident
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా పరిధిలోని పెద్దకొడపగల్ మండలం జగన్నాథ్‌పల్లి గేటు వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిచ్కుంద నుంచి పిట్లం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/