భారత్​-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు మిస్సింగ్..

భారత్​-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతు అయ్యారు. దామిన్ స‌ర్కిల్ వ‌ద్ద బోర్డ‌ర్ రోడ్డు ప‌నిలో నిమ‌గ్న‌మైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం క‌నిపించ‌కుండాపోయారు. రాజ‌ధాని ఇటాన‌గ‌ర్‌కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాగా ఈ 19 మందిలో ఒకరు విగతజీవిగా కనిపించారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

చైనాతో ఉన్న వాస్త‌వాధీన రేఖ‌కు స‌మీపంలోనే కార్మికులు అదృశ్య‌మ‌య్యారు. అయితే కుమే న‌దిలో ఓ కార్మికుడి మృత‌దేహాన్ని గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌ట్లు కాంట్రాక్ట‌ర్ తెలిపారు. ఈద్ పండుగ సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్ట‌ర్ కార్మికుల‌కు లీవ్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది.