లారీ బీభత్సం..ఇద్దరు విద్యార్థులు మృతి

ఆర్టీసీ క్రాస్‌ రోడ్ లో ప్రమాదం.. అదుపుతప్పి విద్యార్థులపైకి దూసుకుపోయిన లారీ

Accident
Accident

హైదరాబాద్‌: ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఎంబీ భవన్ వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి ముందుకు దూసుకువెళ్లి పలు వాహనాలను ఢీ కొట్టింది. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఇద్దరు కాలేజీ విద్యార్థులు బైక్‌పై వెళ్తూ ఆ లారీ ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందారు. వారిద్దరు హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రోడ్డుపై పడి ఉన్న వారి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/