బ్రిటన్‌ కొత్త ఆర్థికమంత్రిగా రిషి సునక్

రిషి సునక్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

rishi-sunak
rishi-sunak

బ్రిటన్‌: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్ కొత్త ఆర్థిక మంత్రిగా నియమితుడయ్యారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్ జావిద్ పదవికి రాజీనామా చేయడంతో రిషి సునక్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. రిషి సునక్ ప్రస్తుతం ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. రిషి మంత్రిగా పనిచేయడం ఇది రెండోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లో జన్మించిన రిషి సునక్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీనుంచి డిగ్రీ పట్టా నందుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/