ఎయిర్‌ ఇండియాకు కొత్త సీఎండీగా రాజీవ్‌ బన్సల్‌

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

Rajiv-Bansal-Air-India
Rajiv-Bansal-Air-India

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పౌర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్)గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ బన్సల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజీవ్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం పలికింది. ఇప్పటి వరకూ ఏఐ సీఎండీగా ఉన్న అశ్వనీ లొహానీ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 1988 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ అధికారిగా ఉన్న రాజీవ్ బన్సల్ ను ఈ పోస్టులో నియమించారు. గతంలో 2006 నుంచి 2008 వరకూ పౌర విమానయాన శాఖలో విధులు నిర్వహించిన ఆయన, ప్రస్తుతం పెట్రోలియం, సహజవాయు శాఖలో కార్యదర్శిగా ఉంటూ, 2017 ఆగస్టు నుంచి ఎయిర్ ఇండియాలో అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/