జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో రేవంత్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తమ కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలా తీసుకు వస్తారు ? అని బంజారాహిల్స్ ఏసీపీ, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ లను నిలదీశారు. తన ఇంటి మీద దాడికి పాల్పడిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోరు? .. వారిపై ఎందుకు ఎఫ్ ఆర్ ఐ చేయారు ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు బుక్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.

మంత్రి కేటీఆర్‌‌‌‌పై పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్‌‌‌‌ఎస్వీ నాయకులు మంగళవారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌‌‌‌ నాయకులు అడ్డుకోవడంతో ఇరు పక్షాలూ బాహాబాహీకి దిగాయి. ఒక దశలో టీఆర్‌‌‌‌ఎస్వీ నాయకులను కాంగ్రెస్‌‌‌‌ నేతలు కొంతదూరం వెంటబడి తరిమారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఇరు పార్టీల లీడర్లు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వేడిని మరింత పెంచారు.

YouTube video