ఎంపీ కేశినేని నానికి కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు

తెలుగుదేశం ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక పదవి అప్పగించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జి పదవిని కేశినేని నానికి అప్పజెప్పారు చంద్రబాబు. గత కొద్దీ రోజులుగా ఈ పదవి కోసం బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా ఆశించినప్పటికీ చివరకు చంద్రబాబు మాత్రం నానికి అప్పజెప్పారు.

అలాగే రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా చిరుమామిళ్ల మధుబాబుకు అవకాశం ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గం ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి, విశాఖ సౌత్ నియోజకవర్గం ఇన్చార్జిగా గండి బాబ్జిలను నియమించారు. కాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నానికి మరింత స్వేచ్ఛ కల్పించారు. డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే అధికారాన్ని కట్టబెట్టారు. అయితే, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాకు.. ఎంపీ కేశినేని నానికి మధ్య వర్గ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఈ క్రమంలో ఎంపీ కేశినేనికి కీలక పదవి అప్పగించడం.. టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని స్థానిక కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.