మర్రి శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యల ఫై రేణుకా చౌదరి కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం వస్తుందని కార్య కర్తలు అనుకున్నారో లేదో..పార్టీ లో నేతల మధ్య విభేదాలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ లో కొత్త ఉత్సహం వచ్చింది. కానీ ఆ ఉత్సహం ఎంతోసేపు లేదు. రేవంత్ కు కీలక పదవి కట్టబెట్టడం ఫై నేతలు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది కాంగ్రెస్ ను విడి వెళ్తుంటే..మరికొంతమంది మాత్రం రేవంత్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూరే కారణమంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.

మర్రి శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యల ఫై కొంతమంది నేతలు తప్పుబడుతుండగా..మరికొంతమంది సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మర్రి శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యల ఫై స్పందించారు. కాంగ్రెస్​లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌తో ఆమె సమావేశమయ్యారు. మర్రి శశిధర్‌రెడ్డి సమస్య సర్దుకుంటుందని.. ఆవేదనలో అలా మాట్లాడారని ఆమె అన్నారు. శశిధర్‌ రెడ్డి ఓపికగా ఉండే వ్యక్తిగా పేర్కొన్న ఆమె… ఆయనకు మనసులో ఏదో బాధ అనిపించి అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డి కూడా ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని రేణుకా చౌదరి తెలిపారు. పార్టీలో తమను అవమానించేవారెవరూ లేరని… అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసునని పేర్కొన్నారు. ఖమ్మంలో తనను ఎదుర్కొనే వారు లేరని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవడం బాధకరమేనని… మునుగోడులో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.