హుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ : వారానికి ఇంటి అద్దె రూ. 10 వేలు

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ : వారానికి ఇంటి అద్దె రూ. 10 వేలు

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇంటి యజమానులకు బాగా కలిసొస్తుంది. మొన్నటి వరకు రెండు , మూడు వేలు నెలకు తీసుకున్న అద్దె ఇంటి యజమానులు..ఇప్పుడు వారానికే రూ. 10 వేలు అడుగుతున్నారు. వారు అడిగినంత ఇచ్చేందుకు నేతలు ముందుకు వస్తున్నారు.

హుజురాబాద్‌లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటివరకు హుజురాబాద్‌లో ఉండేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేతలతో పాటు కార్య కర్తలు , కళాకారులు ఇలా పార్టీకి సంబదించిన వారు ఉండేందుకు అద్దె ఇంటిని చూసుకుంటున్నారు. హుజురాబాద్ లో తక్కువ సంఖ్యలో అద్దె ఇల్లులు ఉండడం తో నేతలకు ఇబ్బందిగా మారింది. అద్దె ఇంటి యజమానులు నేతల అవసరాన్ని బాగా క్యాష్ చేసుకుంటూ వారానికే రూ. 10 వేలు అడుగుతున్నారు. వారు అడిగినంత ఇచ్చేందుకు నేతలు ముందుకు వస్తున్నారు. హుజురాబాద్ పట్టణంలో ఇళ్లు దొరక్కపోవడంతో ఇప్పల నర్సింగపూర్, సింగపూర్‌ గ్రామాల్లో అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. అక్కడ కూడా భారీగా అద్దె వసూళ్లు చేస్తున్నారట.