ఇప్పటం లో వైస్సార్ విగ్రహం తొలగింపు

ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు పేరుతో ప్రభుత్వం ఇళ్ల కూల్చివేత రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ మీటింగ్ కు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చేరని కోపం తో గ్రామంలో రోడ్ల వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చేశారని గ్రామస్థులతో పాటు , ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. శనివారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించి గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో రోడ్డుపై ఉన్న వైస్సార్ విగ్రహాన్ని తొలగించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు.

దేశం కోసం పోరాడిన వ్యక్తుల విగ్రహాలు కూల్చారని , కానీ వైస్సార్ విగ్రహం మాత్రం అలాగే ఇచ్చి , దానికి పోలీసులు కాపలా పెట్టారని ఆరోపించారు. దీంతో ప్రభుత్వ అధికారులు ఈరోజు ఆ విగ్రహాన్ని కూడా తొలగించారు. మొత్తం మీద ఇప్పటం ఇళ్ల కూల్చివేత ఫై ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాన్య ప్రజలు సైతం ప్రభుత్వం ఫై ఆగ్రహం గా ఉన్నారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామానికి 120 ఫైట్ల రోడ్డు ఎందుకు అని ప్రశిస్తున్నారు. గుంతల రోడ్ల ను బాగుచేయని ప్రభుత్వం , ఉన్న రోడ్డును వెడల్పు చేస్తామనడం విడ్డురంగా ఉందని అంటున్నారు.