ఒకేసారి మూడు కేసుల్లోచంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు

చంద్రబాబుపై మద్యం, ఐఆర్ఆర్, ఉచిత ఇసుక కేసులు

chandrababu-naidu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. హైకోర్టు జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా, మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనరేశ్ కు కూడా బెయిల్ మంజూరైంది.