దేశంలో కొత్తగా 2,745 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 2,745 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా ఆరుగురు ప్రాణాలు విడిచారు. 2236 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మంగళవారం 10,91,110 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,93,57,20,807 కు చేరింది. ఒక్కరోజే 4,55,314 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కుడా భారీగా పెరిగాయి. కొత్తగా 533,069 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 532,657,109కు చేరింది. మరణాల సంఖ్య 6,313,584కు చేరింది. ఒక్కరోజే 651,167 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 503,634,059గా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/