మళ్లీ కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథం

RBI Interest Rates: MPC keeps repo, stance unchanged as inflation concerns weigh

న్యూఢిల్లీః కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అందరూ ఊహించినట్టుగానే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్దనే ఉంచాలని గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయించింది. ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించిన నిర్ణయాలను ఈ సందర్భంగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. విశ్లేషకుల అంచనాలను మించి భారత దేశ వృద్ధి రేటు నమోదవుతుందని ఈ సందర్భంగా శక్తికాంత దాస్‌ తెలిపారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు.

కాగా, దాదాపు రెండేండ్ల నుంచి పెరుగుతూ వచ్చిన వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెపోరేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయడం లేదు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన ఎంపీసీ సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆర్బీఐ పాలసీ రేట్లతో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. అయితే.. వడ్డీ రేట్లను ఎక్కువ రోజులు ఇలాగే కొనసాగవని.. తదుపరి రోజుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.