మరోసారి మాస్ రాజా సింగర్ అవతారం

మరోసారి మాస్ రాజా సింగర్ అవతారం

మాస్ రాజా రవితేజ మరోసారి సింగర్ గా మారాడు. గతంలో ‘బలుపు’ చిత్రంలో కాజల్ చెల్లివా, ‘పవర్’ చిత్రంలో నాటోంకి నాటోంకీ, ‘డిస్కోరాజా’లో రమ్ పమ్ బమ్ లాంటి మాస్ సాంగ్స్ పాడిన రవితేజ..ఇప్పుడు ఖిలాడీ చిత్రంలో ఓ సాంగ్ పాడినట్లు తెలుస్తుంది. రవితేజ-రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా ‘ఖిలాడి’. ఈ మూవీ లో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనుండగా..డింపుల్ హయాతి, మీనాక్షీ చైదరి హీరోయిన్స్‌గా నటించారు. అర్జున్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ లో రవితేజ ఓ హుషారైన పాటను పాడబోతున్నాడు. ఈ సాంగ్ రికార్డింగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 11న ‘ఖిలాడి’ సినిమా విడుద‌ల‌వుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. అది విడుదలైన వారం రోజులకు రవితేజ ఖిలాడి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుందన్నమాట.