రంగరంగ వైభవంగా మూవీ టాక్ ఎలా ఉందంటే..

A Still from Ranga Ranga Vaibhavanga Movie

ఉప్పెన ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. డైరెక్టర్ గిరీశయ్య తెరకెక్కించిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ మూవీ ని చూసిన అభిమానులు , ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

సినిమా యావరేజ్ గా ఉందని , ఫస్ట్ హాఫ్ బాగుందని , సెకండ్ హాఫ్ రొటీన్ గా సాగిందని , ఎమోషనల్ సీన్స్ బాగున్నాయని కొంతమంది అంటుంటే ..మరికొంతమంది మాత్రం జస్ట్ ఓకే అన్నట్లు చెపుతున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ను చూపిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారట. అయితే, ఇంటర్వెల్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుందట. కానీ, సెకెండాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని అంటున్నారు. ఇక, క్లైమాక్స్ మాత్రం తేలిపోయేలా ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరి పూర్తి రివ్యూస్ పడితే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది.