ప్రకాశం జిల్లాలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో పేలుడు

ప్రకాశం జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో పేలుడు సంభవించడంతో ఒక్కక్కటిగా గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి దాదాపు 300 ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు భయంతో పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.