రామారావు ఆన్ డ్యూటీ కొత్త రిలీజ్ డేట్

మాస్ మహారాజా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. క్రాక్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ..ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. ధమాకా , టైగర్ నాగేశ్వరరావ్ లతో పాటు శరత్ మాండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ చేసాడు. ఈ సినిమాను ముందుగా మార్చి 25 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.

కానీ కరోనా కారణంగా షూటింగ్ కు అంతరాయం ఏర్పడడం తో రిలీజ్ డేట్ ను జూన్ 17 కు వాయిదా వేశారు. కానీ ఆ డేట్ కు కూడా రాలేకపోయింది. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడో వస్తుందో అని అభిమానులు మాట్లాడుకుంటున్న తరుణంలో మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించి ఆనందం నింపారు. జులై 29న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ మూవీ లో రవితేజకు జోడిగా దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.