‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ..

మాస్‌ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. నూతన డైరెక్టర్ శరత్‌ మండవ డైరెక్ట్ చేయగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ కు జోడిగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ టాక్ దక్కించుకుంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే..

నైజాం – రూ.85 లక్షలు

సీడెడ్ – రూ.52 లక్షలు

ఈస్ట్ – రూ.31 లక్షలు

వెస్ట్ – రూ.16 లక్షలు

ఉత్త‌రాంధ్ర – రూ.45 లక్షలు

గుంటూరు- రూ.24 లక్షలు

కృష్ణా – రూ.17 లక్షలు

నెల్లూరు – రూ.12 లక్షలు

రెస్టాఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ – రూ.58 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 3.30 కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టింది. ఇటీవల కాలంలో రవితేజ కెరీర్‌లో ఫస్ట్‌డే అతి తక్కువ వసూలు చేసిన చిత్రంగా రామారావు నిలిచింది. రవితేజ నటించిన గత ఐదు చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే.. క్రాక్ రూ. 6.25, డిస్కో రాజా రూ.2.54 , అమర్ అక్బర్ ఆంటోని రూ. 3.40 కోట్లు , ఖిలాడీ రూ. 4.30 కోట్లు రాబట్టాయి.