ఓ వ్యక్తిని కారుతో గుద్దేసిన సీరియల్ నటి లహరి

ఓ వ్యక్తిని కారుతో గుద్దేసిన సీరియల్ నటి లహరి

హైదరాబాద్ రోడ్ల ఫై ప్రయాణం చేయాలంటే భయం వేస్తుంది..ఏ క్షణాన ఏ మందు బాబు వచ్చి ఢీ కొడతాడో..ఎటునుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రాణాలను అరచితిలో పట్టుకొని రోడ్డు ఎక్కుతున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో పలు ప్రమాదాలు పలువుర్ని బలి తీసుకున్నాయి. తాజాగా గత రాత్రి సీరియల్ నటి లహరి ఓ వ్యక్తిని తన కారుతో గుద్దేసింది.

తెలుగు సీరియళ్లలో ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న లహరి..అతివేగంతో శంషాబాద్ నుండి వస్తూ బైక్ ఫై వెళ్తున్న వ్యక్తిని గుద్దేసింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆ వ్యక్తి రక్తమోడుతున్నా కూడా కనీసం లహరి కారులోంచి దిగకపోవడంతో స్థానికులంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లహరిని కారుతో సహా శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మద్యం సేవించి లహరి కారు నడిపినట్టు వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకూ పోలీసుల నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.