మైసూర్ లో రామ్ – శ్రీ లీల సందడి

మైసూర్ లో రామ్ – శ్రీలీల సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా క్లైమాక్స్ సన్నివేశాలు పూర్తి చేసిన యూనిట్..ప్రస్తుతం మైసూర్ లో హీరో , హీరోయిన్ ఫై ఓ పాట చిత్రీకరణ చేస్తున్నారు. ఈ పాట కోసం యూనిట్ మైసూర్ కు చేరుకున్నారు.

ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్రని బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పోషించనున్నాడని సమాచారం. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో దసరాకి విడుదల చేయనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది.