ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

telangana-govt-hikes-da-for-employees-and-pensioners

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. కరువు భత్యం(DA/DR) పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరవుభత్యం (డీఏ/డీఆర్) 2.73 శాతం పెంచింది. ఇప్పటిదాకా కరవుభత్యం 17.29 శాతం ఉండగా, తాజా పెంపుతో 20.02 శాతానికి చేరింది.

దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కరవుభత్యం పెంపుతో 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పింఛనుదారులు లబ్దిపొందనున్నారని వెల్లడించారు. పెంచిన కరవుభత్యం 2021 జులై 1 నుంచి వర్తింపజేస్తామని తెలిపారు. జ‌న‌వ‌రి ఫించ‌నుతో క‌లిపి పింఛ‌నుదారుల‌కు ఫిబ్ర‌వ‌రిలో డీఏ చెల్లించ‌నుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబ‌ర్ నెల‌ఖారు వ‌ర‌కు బ‌కాయిలు చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.