మునుగోడు ప్రచారానికి రాజగోపాల్ దూరం..?

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ దూరం కాబోతున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. నిన్నటి నుండి రాజగోపాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట..వారం రోజుల పాటు డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలని సూచించారట. దీంతో రాజగోపాల్ ప్రచారానికి దూరం కాబోతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మునుగోడు ఉపఎన్నికను బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను కూడా వాయిదా వేసుకుని మునుగోడులో బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. మండలాల వారీగా బీజేపీ ఇంచార్జ్‌లను నియమించి గెలుపు బాధ్యతలను వారికి అప్పగించింది. ఇలాంటి క్రమంలో రాజగోపాల్ కు జ్వరం రావడంతో మంగళవారం ఉపఎన్నిక ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి నేడు నాంపల్లి మండలంలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ జ్వరం కారణంగా ఆ పర్యటను రద్దు చేసుకున్నారు. జ్వరం తగ్గితే బుధవారం నుంచి రాజగోపాల్ రెడ్డి తిరిగి ప్రచారం నిర్వహించే అవకాశముంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే రాజగోపాల్ తీవ్ర జ్వరం తో ఉన్నారని డాక్టర్స్ వన్ వీక్ వరకు రెస్ట్ తీసుకోవాలని సూచించారని అంటున్నారు. ప్రచారం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయన త్వరగా కోలుకుని ప్రచారానికి తిరిగి రావాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.