తండ్రికాబోతున్న రాహుల్ రామ‌కృష్ణ

కమెడియన్ రాహుల్ రామ‌కృష్ణ తండ్రి కాబోతున్నారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించే రాహుల్..సోషల్ మీడియా ద్వారా తాను తండ్రి కాబోతున్న విషయాన్నీ తెలియజేసారు. సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే రాహుల్..కొద్దీ రోజుల ముందు భార్య‌ను ప‌రిచ‌యం చేస్తూ ఆమెతో లిప్ లాక్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి వైరల్ అయ్యాడు. మ‌రి ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలియ‌దు కానీ.. త‌న భార్య ప్రెగ్నెంట్ అని చెప్పి ఈరోజు అంద‌రికీ షాకిచ్చారు. ‘మా లిటిల్ ఫ్రెండ్‌కి హాయ్ చెప్పండి’ అంటూ త‌న భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోను షేర్ చేసారు.

సినీ రంగం విషయానికి వస్తే… తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన సైన్మా అనే లఘుచిత్రంతో అతని కెరీర్ ప్రారంభమైంది. ఈ సినిమాకు మంచి ప్రశంసలు రావడంతో జయమ్ము నిశ్చయమ్మురా (2016) అనే సినిమాలో కథానాయకుడి సహాయ పాత్ర చేసే అవకాశం లభించింది. శివరాజ్ కనుమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, పూర్ణ ప్రధాన పాత్రధారులు.

తర్వాత అతను అర్జున్ రెడ్డి (2017) చిత్రంలో కథానాయకుడి స్నేహితుడు శివగా నటించాడు. ఈ పాత్ర స్నేహితుడు ఏ స్థితిలో ఉన్నా అతనికి అండగా నిలుస్తూ అతనికి నైతిక బలం ఇచ్చే ప్రధామైన పాత్ర. దానికి తగ్గట్టు కొద్దిపాటి హాస్యం కూడా ఈ పాత్రకు జోడించబడింది. ఈ సినిమాతో ఇతనికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అర్జున్ రెడ్డి తెచ్చిన పేరుతో 2018 లో భరత్ అనే నేను, సమ్మోహనం లాంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత అమెజాన్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. 2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాలో అర్జున్ రెడ్డి లాగానె నాయకుడు విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా కనిపించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 2020 లో అల వైకుంఠపురములో సినిమాలో ఓ పాత్ర పోషించాడు.