సీఎం కేసీఆర్ పబ్లిక్ నోటీస్

సీఎం కేసీఆర్ ప్రజలకు పబ్లిక్ నోటీసు ఇచ్చారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తున్నట్లు టీఆర్ఎస్ సోమవారం బహిరంగ ప్రకటన జారీచేసింది. పార్టీ పేరు మార్పుపై అభ్యంతరం ఉంటే తెలపాలని ఈ ప్రకటనలో కోరింది. ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను, తగిన ఆధారాలను తెలపాలని సూచించింది.

మునుగోడు ఉపఎన్నిక విజయంతో టీఆర్ఎస్‌ మరింత దూకుడు పెంచింది. బీఆర్ఎస్‌గా పేరు మార్చిన తర్వాత ఎదుర్కొన్న తొలి ఎన్నికలో గెలుపు జెండా ఎగురవేయడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఊపు కనిపిస్తోంది. ఈ జోష్‌లో బీఆర్ఎస్‌పై సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటివరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. ఇప్పటికే బీఆర్ఎస్‌ పేరు మీద దేశవ్యాప్తంగా చాలా పార్టీలు రిజిస్టర్ అయి ఉండటంతో.. ఈసీ పెండింగ్‌లో ఉంచినట్లు వార్తలు వస్తోన్నాయి.

కాగా బీఆర్ఎస్‌కు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్ సోమవారం జారీ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్ పేరుతో ఈ పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. బీఆర్ఎస్ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలపాలని పబ్లిక్ నోటీస్‌లో పేర్కొన్నారు. 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలను పంపాలని సూచించారు.