2024 లో రాహుల్ దేశ ప్రధాని కావడం ఖాయం – VH

2024 లో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి కావడం ఖాయం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. పరువునష్టం కేసులో గుజరాత్ హైకోర్టు రాహుల్ పిటిషన్ ఫై ఇచ్చిన తీర్పు ఫై హనుమంతరావు స్పందించారు. రాహుల్ గాంధీ పై తప్పుడు ఫిర్యాదు బిజెపి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అని , గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం అని హనుమంతరావు అన్నారు.

భారత్ జోడో యాత్రకు ప్రజల్లో వచ్చిన ఆధారణను జీర్ణించికోలేక బిజెపి రాహుల్ ను ఇబ్బందులకు గురించేస్తున్నారని మండిపడ్డారు. 2024 లో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు. న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పొయ్యేలా కోర్టు తీర్పునిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో దేశంలో మోడీ, అమిత్ షా కు ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా వచ్చే ఎన్నికల ఫై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకరావమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నారు. మరోపక్క ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండడం తో పార్టీకి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సహం రెట్టింపు చేస్తుంది. రీసెంట్ గా పొంగులేటి చేరిన సంగతి తెలిసిందే.