నేను కూడా రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాస్తా: రఘురామ

న్యూఢిల్లీ : నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాశారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. రూ.43 వేల కోట్లు దోచిన కేసులున్న వాళ్లు తనపై ఆరోపణలు చేశారని అన్నారు. అన్ని అంశాలను పక్కనబెట్టి తనపై అనర్హత వేటు వేయాలని అడుగుతున్నారని మండిపడ్డారు. దొంగలంతా కలిసి తనపై ఆరోపణలు చేస్తున్నారని, జులై 26న సీబీఐ కోర్టులో అన్నీ తేలతాయని ఆయన అన్నారు.

తనపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న వైస్సార్సీపీ పెద్దలు అన్నీ తెలిసి తనకు ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. నాపై తమిళనాడులో కేసులకు సీఎం జగన్, బాలశౌరి కారణమని రఘురామ ఆరోపించారు. విశాఖను విజయసాయిరెడ్డి లూటీ చేస్తున్నారని, తాను కూడా రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/