చౌటప్ప నాయుడుగా మారుతున్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ తన నటవిశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు తారక్ సిద్ధమయ్యాడు. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. కానీ ఇంకా ఈ సినిమ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించలేదు. కాగా ఈ సినిమా కథను పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది. కాగా తాజాగా ఈ సినిమా కోసం మరో కొత్త టైటిల్‌ను పెట్టబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు ‘చౌటప్ప నాయుడు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు చిత్ర టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ కూడా చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ అయితే సినిమాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ప్రేక్షకులను తప్పకుండా అలరించనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.