తెనాలిలో కారు బీభత్సం..

ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే ప్రజలు వణికిపోయే రోజులు వచ్చాయి. మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ మృతువు ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. తప్పతాగి డ్రైవింగ్ చేయడం , ఓవర్ స్పీడ్ , డ్రైవింగ్ తెలియని వారు రోడ్ల పైకి వాహనాలతో రావడంతో ఇలా పలు కారణాలతో నిత్యం రోడ్ ఆక్సిడెంట్ జరుగుతూ అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా బుధువారం తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌లో ఉన్న కారు అదుపు తప్పి.. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఒకరి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.. మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే కారు కింద పడి పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ కారును ఇద్దరు మైనర్లు కారు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి ఇలా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారు డ్రైవింగ్‌ చేసిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.