హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..పార్టీ నేతలకు పురందేశ్వరి సూచన

రాష్ట్ర కార్యవర్గ నేతలతో వర్చువల్ గా పురందేశ్వరి సమావేశం

Purandeshwari meeting virtually with state executive leaders

న్యూఢిల్లీః సర్పంచ్ ల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బాగా పోరాటం చేశారంటూ రాష్ట్ర కార్యవర్గ నేతలను బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశంసించారు. ఈరోజు వర్చువల్ విధానంలో రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. బిజెపి, జనసేన పొత్తు సంకేతాలను బలంగా వినిపించాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈనెల 14న విభాజిత్, విభీషణ్ కార్యక్రమాన్ని చేపట్టాలని, రాత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు నేతలందరూ కలిసి పని చేయాలని చెప్పారు.