నేడు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం

బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్: నేడు తెలంగాణలో అక్కడక్కడ భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉందని, దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది.

వీటి ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురవడంతోపాటు రేపటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిన్న 109 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా కోలుకొండలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/