ప‌లు ప‌బ్ ల ముందు బోర్డులు..21ఏళ్లు దాటిన వారికే ప్ర‌వేశం

new year celebrations
pub-21 years-allowed-hyderabad-pubs-board

హైదరాబాద్ : 21ఏళ్లు దాటిన వారికే ప‌బ్ ల‌లో ప్ర‌వేశం అంటూ హైద‌రాబాద్ లోని ప‌లు ప‌బ్ ల ముందు బోర్డులు వెలిశాయి. ఈ మేర‌కు 21ఏళ్ల‌లోపు వారు ఒక్క‌రు ఉన్నా..గ్రూపు..కుటుంబ పార్టీల‌కు ప‌బ్ లు నో చెబుతున్నాయి.ఓ పబ్ నుంచి మైనర్ ను కారులో తీసుకెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం పెద్ద సంచలనంగా మారడం తెలిసిందే. ప్రముఖుల పిల్లలు ఈ కేసులో నిందితులుగా ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటన తర్వాత పబ్ ల సంస్కృతిపై బీజేపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి.

ఈ పరిణామాలతో పబ్ ల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మేజర్ అయిన వారికి పబ్ లో ప్రవేశానికి అనుమతి ఉంటుంది. కొన్ని పబ్ లు పదేళ్లలోపు పిల్లలను పెద్దలతో కలసి లంచ్ పార్టీలకు అనుమతిస్తున్నాయి. కాకపోతే ఎక్కువ శాతం పబ్ లు పెద్దలకు మాత్రమే ప్రవేశం అన్న నిబంధనను పాటిస్తున్నాయి. మే 27 నాటి ఘటన తర్వాత పబ్ యజమానులు తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు.. ఎవరికీ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నట్టు ఓ పబ్ నిర్వాహకుడు తెలిపారు. అందుకనే పెద్దలతో కలసి వచ్చినా మైనర్లను పబ్ లు అనుమతించడం లేదని చెబుతున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/