నిక్‌తో కలిసి ప్రియాంక రొమాంటిక్ పోజ్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి తన భర్త నిక్ తో కలిసి రొమాంటిక్ స్టిల్ కు పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోజ్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న క్రమంలో హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలోనే అమెరికా పాప్ సింగర్ నిక్‌ జోనాస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రియాంక చోప్రా అతడిని 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అప్పట్లో ఈ పెళ్లి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రస్తుతం ఇద్దరు తన దాపత్య జీవితాన్ని హ్యాపీగా కొనసాగుతూనే వృత్తి పరంగా అలరిస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రియాంక చోప్రా..ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను షేర్ చేస్తూ నెటిజన్ల ను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది. ఈసారి కూడా ప్రియాంక చోప్రా హాటెస్ట్ స్టిల్ ను సోషల్ మీడియాలలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది. అందులో ఆమె తన భర్త నిక్ జోనస్‌తో కలిసి స్టైలిష్ లుక్‌తో కనిపించింది. అయితే, ఈ పిక్‌లో ప్రియాంక ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పర్హాన్ అక్తర్ సరసన జీలే జరా అనే చిత్రంలో నటిస్తోంది. ఇంకా హలీవుడ్ లో మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.