టెన్షన్‌ లేకుండా పరీక్షలకు సన్నద్ధం

భయపడాల్సిన అవసరం లేదు

పదోతరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఫస్ట్‌టైమ్‌ మీరు పబ్లిక్‌ పరీక్షలు రాయడం వల్ల కొద్దిగా టెన్షన్‌ ఉండడం సహజమే. అలాగని భయపడాల్సిన అవసరం లేదు.

భయపడవద్దన్నారని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం కూడా సరైంది కాదు. ప్రణాళికాబద్ధంగా సిద్ధపడితే మీరు ఆశించిన మార్కుల్ని పొందవచ్చు.

పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదవడం ముఖ్యం.

కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదవడం ముఖ్యం.

వేళకు తినడం, సరిపడ నిద్ర కూడా ఉండాలి. టెన్షన్‌తో నిద్రపట్టడం లేదని బాధపడేవారున్నారు. చదివినవి ఏమీ గుర్తుకు వ్ఞండడం లేదనే బాధ మరికొందర్ని వెంటాడుతుంది.

ఇవన్నీ పరీక్షల ముందు సహజలక్షణాలే. ఇప్పటి వరకు మీరు చదివిన అంశాలను పాయింట్ల వైజ్‌గా పేపర్‌పై రాసుకుని పెట్టుకోండి.

సబ్జెక్టు ప్రకారం అన్ని పేపర్లను ఇదేవిధంగా రాసి సరిచేసుకోండి. ఇంకా మీకు రానివి ఏన్ని ఉన్నాయని పరిశీలించుకోండి. వాటికి ముఖ్యమైనవి ఏవైనా ఉన్నాయో ఒకసరి చూసుకోండి. వాటిని చదవండి.

చదివినవి మీ స్నేహితులకు కానీ బంధువ్ఞలకు కాని చూడకుండా చెప్పండి. తద్వారా మీ జ్ఞాపకశక్తి మరింతగా పెరుగుతుంది.

చదివినవి పదేపదే గుర్తు చేసుకోవడం మంచిది. పేపర్‌పై ఎప్పటికప్పుడు రాస్తూ ప్రాక్టిస్‌చేయాలి.

ముఖ్యంగా లెక్కలు, ఇంగ్లీషు. చాలామంది భాషలో పదదోషాలుంటే దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇది సరైంది కాదు. ఇంగ్లీషు గ్రామర్‌లో సరైన స్పెల్లింగ్‌ తప్పురాస్తే మార్కులు కోల్పోవాల్సి వస్తుంది.

కాబట్టి స్పెల్లింగులకు తగిన ప్రాధాన్యత నివ్వాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం https://www.vaartha.com/news/business/