18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

అధికారికంగా ప్రకటించిన బోర్డు

Results

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్  ఎడ్యుకేషన్-TSBIE  అధికారికంగా ప్రకటించింది. ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఎప్పుడో పూర్తయింది. అయితే ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫలితాలు విడుదల చేయాలనుకున్నారు. అందుకే ఫలితాల విడుదలకు కాస్త ఆలస్యమైంది. ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది ఇంటర్ బోర్డు. గురువారం ఫలితాలను విడుదల చేయనుంది. కాగా తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/