కొబ్బరి పాల రసం తయారీ

రుచి: కొత్త వంటకాలు ‘చెలి’ పాఠకులకు ప్రత్యేకం

coconut milk juice
coconut milk juice

కావలసిన పదార్థాలు

ఇంగువ – చిటికెడు
కొత్తిమీర – రెండు టేబుల్‌ స్పూన్‌లు
చిక్కటి కొబ్బరిపాలు – ఒక ప్పు
ఆవాలు – అర టీ స్పూన్‌
చింతపండు – ఒక టేబుల్‌ స్పూన్‌
ఉప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌
పసుపు – పావు స్పూన్‌
కొబ్బరి నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి – ఒకటి
(అందులోని గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
కరివేపాకులు – ఏడు
వేడినీళ్లు – అరకప్పు
చల్లట నీళ్లు – ఒకటిన్నర కప్పు
రసం పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు

తయారు చేయు విధానం

అరకప్పు వేడి నీళ్లలో చింతపండును అరగంటపాటు నానబెట్టి దాన్నించి చిక్కటి రసం తీయాలి. బాండీ తీసుకుని అందులో చింతపండు రసం పోసి అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు కలపాలి.

కడాయిలోని రసం మరిగే దాకా సన్నని మంటపై దాన్ని అలాగే ఉంచాలి. రసం మరగడం మొదలైన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు అదనంగా మంటపై ఉంచాలి.

తర్వాత మంట ఆపేసి అందులో ఒక కప్పు చిక్కటి కొబ్బరిపాలు పోసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత దాన్ని ఒకసారి కలిపి మూతపెట్టి పక్కన పెట్టాలి

తర్వాత చిన్న కడాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె ( లేదా నెయ్యి కూడా వాడవచ్చు) వేసి వెడి అయ్యాక కాస్త మంట తగ్గించి ఆవాలు వేయాలి .

అవి చిటపటలాడుతుంటే అందులో రెడీగా పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు వేయాలి. ఇంగువ, కరివేపాకులు అందులో వేయాలి.

తాలింపు బాగా వేగాక దాన్ని కొబ్బరిపాల రసంలో వేయాలి.
దానిపై కొత్తిమీర చల్లాలి. వేడి అన్నంలోకి ఈ కొబ్బరిపాల రసం ఎంతో రుచిగా ఉంటుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/