చేతుల మృదుత్వానికి

అందమే ఆనందం

softness of the hands
softness of the hands

అనేక కారణాల వల్ల చేతులు నల్లగామారుతాయి. పొడిచర్మం వల్ల కూడా చేతులు నల్లగా మారవచ్చు. లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మారవచ్చు.

ఎండ ప్రభావం కూడా మరో కారణం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో తిరగడం వల్ల కూడా చర్మం క్రమంగా నల్లగా మారుతుంది. అదేపనిగా బ్లీచింగ్‌ చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు వాడడం వల్ల కూడా కావచ్చు.

బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గ్లవుజులు వేసుకోవడం మంచిది. వైద్యుల సలహాతో నాణ్యమైన మాయిశ్చరైజర్‌, క్రీంలు వాడవచ్చు.

మొదట చేతులకు మాయిశ్చరైజర్‌ రాసుకుని దీనిపై క్రీములను రాసుకోవాలి. చివరగా సన్‌స్క్రీన్‌ని రాసుకోవాలి. అయితే ఎక్కడున్నా సన్‌స్క్రీన్‌ని కూడా ప్రతి రెండు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి.

ఇలా చేయడం వల్ల కొంత వరకూ ఫలితం ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో సూపర్‌ ఫీషియల్‌ కెమికల్‌ పీల్స్‌ చేయించుకోవడం వల్ల కూడా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

అలాగే వారానికోసారి చెంచా పాల మీగడా, రెండు చెంచాల బొప్పాయి గుజ్జు, కొద్దిగా సెనగపిండి కలిపి చేతులకు పూతలా వేసుకోవాలి.

తేనె, కమలాఫలం, తొక్కపొడి, మీగడా కలిపి రాసుకున్నా నలుపుదనం కొంతవరకు తగ్గుతుంది. ఈ పూతల్ని పదిమేను నిమిషాల తరువాత కడిగేసుకోవాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/