సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకున్న ‘ప్రేమించుకుందాం రా’ టీం

వెంకటేష్ , అంజలి జవేరి జంటగా జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ప్రేమించుకుందాం రా. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా 1997 , మే 10 న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం వెంకీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రం నేటికీ పాతికేళ్లు (silver jubilee anniversary) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. చిత్ర దర్శకుడు జయంత్ . సి. పరాన్జీ తన ఇన్ స్టా ప్రోపైల్ లో ‘రీయూనియన్ మ్యాడ్ నెస్ ఎట్ హోమ్’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

అలాగే టీమ్ మీట్ కి సంబంధించిన వీడియోని అభిమానులకు షేర్ చేసారు. ఆ సినిమాకు పనిచేసిన వారంతా ఏకమై కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. వెంకటేష్ కేక్ కట్ చేసి షాంపైన్ బాటిల్ ని ఓపెన్ చేసి సెలబ్రేషన్ షురూ చేసారు. లిటిల్ హార్ట్ బిస్కెట్ ప్యాకెట్ కూడా గమనించవచ్చు. ఈ సినిమా టైమ్ లో ఆ బ్రాండ్ బిస్కెట్ ప్యాకెట్ బాగా పాపులర్ అయింది. వేడుకలో భాగంగా వెంక‌టేశ్‌, జ‌యంత్ సీ ప‌రాన్జీ, బెన‌ర్జీ, బాబు మోహ‌న్, నిహారిక‌, (మాస్ట‌ర్) ఆనంద్ వ‌ర్ద‌న్ సినిమాలో న‌టించిన ఇత‌ర యాక్ట‌ర్లు పాల్గొన్నారు.