KGF చిత్ర యూనిట్ ఫై ఐకాన్ స్టార్ ప్రశంసల జల్లు

కెజిఫ్…కెజిఫ్ ..కెజిఫ్ ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తుంది. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన KGF 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డ్స్ ను నెలకొల్పుతుంది. మొన్నటి వరకు బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డ్స్ ను ఈ చిత్రం చెరిపివేసింది..త్వరలో ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఆశ్చర్య పోనవసరం లేదు. అంతలా అన్ని భాషల్లో ఈ చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇక హిందీలో ఈ చిత్రం కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఇప్ప‌టివ‌రకు బాలీవుడ్‌లో 250కోట్ల‌కు పైగా సాధించి బాలీవుడ్ ఖాన్, క‌పూర్‌ల సినిమాల‌ను సైతం వెన‌క్కి నెట్టింది. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌, విజ‌న్‌కు సినీప్ర‌ముఖులు సైతం జైజైలు కొడుతున్నారు. య‌ష్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫై పలువురు సినీ ప్రముఖులు స్పందించగా..తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర యూనిట్ ఫై ప్రశంసలు జల్లు కురిపించారు.

‘కేజీఎఫ్‌-2 చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు. ఈ చిత్రంలో య‌ష్ స్వాగ్ ప‌ర్ఫామెన్స్, ఇంటెన్సిటీ అద్భుతంగా క‌నబ‌రిచాడు. సంజ‌య్‌ద‌త్, ర‌వీనా టాంట‌న్‌, శ్రీనిధీ శెట్టిల‌ న‌ట‌న ప్ర‌శంస‌నీయం. ర‌వి బ‌స్రూర్ బ్యాక్‌గ్రౌండ్ సంగీతం అవుట్ స్టాండింగ్. సినిమాటోగ్రాఫ‌ర్ భువ‌న గౌడ వీజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం కోసం ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రికీ గౌర‌వ మ‌ర్యాద‌లు తెలుపుకుంటున్నాను. ప్ర‌శాంత్ నీల్ విజ‌న్‌కు, క‌న్విక్ష‌న్‌కు ఫిదా అయ్యాను. సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు, భార‌తీయ సినిమా ప‌తాకాన్ని ఎగుర‌వేస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను’ అంటూ బ‌న్నీ ట్విట్ చేశాడు.