మెడిసిన్‌లో ఇద్ద‌రు సైంటిస్టుల‌కు నోబెల్‌

స్టాక్‌హోమ్‌: ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తుల( Nobel Prize ) ప్ర‌క‌ట‌న ప్ర‌క్రియ సోమ‌వారం ప్రారంభ‌మైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియ‌స్‌, ఆర్డెమ్ పాటాపౌటియ‌న్‌లు నోబెల్ గెలుచుకున్నారు. విజేత‌ల‌ను నోబెల్ క‌మిటీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ థామ‌స్ పెర్ల్‌మాన్ ప్ర‌క‌టించారు. ఇప్పుడీ ఇద్ద‌రికీ నోబెల్ బ‌హుమ‌తితో వ‌చ్చే 11 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను స‌మానంగా పంచుతారు.

ఉష్ణోగ్ర‌త‌, స్ప‌ర్శ‌కు సంబంధించి గ్రాహ‌కాల‌ను క‌నుగొన్నందుకుగాను వీళ్ల‌ను నోబెల్ వ‌రించింది. మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంతో మ‌నం ఎలా ఉంటున్నామ‌న్న‌దానితోపాటు మ‌న మ‌నుగ‌డకు ఉష్ణం, చ‌ల్ల‌ద‌నం, స్ప‌ర్శ‌ను గుర్తించే మ‌న సామ‌ర్థ్యం కీల‌కం. మ‌న నిత్య జీవితంలో వీటిని మ‌నం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్ర‌త‌, పీడ‌నాన్ని గ్ర‌హించ‌డానికి మ‌న న‌రాల ప్రేర‌ణ‌లు ఎలా ఉంటాయి? ఈ ప్ర‌శ్న‌కు ప‌రిష్కారాన్ని ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌లు చూపించారు అని నోబెల్ జ్యూరీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/