ప్రజావాక్కు

సామాజిక సమస్యలపై ప్రజాగళం

Voice of the People
Voice of the People

ప్రభుత్వమే ఆదుకోవాలి: -ముచ్కుర్‌ సుమన్‌గౌడ్‌, నిజామాబాద్‌

ఆన్‌లైన్‌ డిజిటల్‌ తరగతులు నిర్వహించడం వలన చాలా మంది విద్యకు దూరంఅయ్యే అవకాశాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ కరోనా వలన కొన్నికుటుంబాలలో తినడానికే కష్ట పరిస్థితుల లో ఉన్నాయి.

ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాల పిల్లలు చదువుకోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

అప్పోసొప్పో చేసి ఒక ఫోన్‌, ట్యాబ్‌, టీవీ, ఏదో ఒకటి కొన్న గాని కుటుం బంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా రెండు కొనాల్సిన పరిస్థితి .

మళ్లీ అందులో నెట్‌ బ్యాలెన్స్‌ ఇంకా భారం అసలే రైతులకి పంటలకి పెట్టుబడి కాలం ఇది పిల్లల చదువుకి అన్నింటికి ఖర్చుపెట్టాలి.

అంటే ప్రజలకి కష్టంతో కూడుకున్న పని. ప్రభు త్వమే ఆలోచించి విద్యార్థుల అందరికి ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేసి అందులోకి అవసరం అయ్యే నెట్‌ బ్యాలెన్స్‌కి కూడా ఆర్థికంగా స్కాలర్‌షిప్‌ రూపంలో ఇవ్వాలి.

కరోనాతో కుదేలైన కోళ్ల పరిశ్రమ: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగం తర్వాత అంతటి ప్రాము ఖ్యత సంతరించుకున్న కోళ్ల పరిశ్రమ కరోనా దెబ్బకు కకావి కలమైపోయింది.

ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోవడంతో మార్చి నుండి రాష్ట్రంలో లక్షలాదికోళ్ల పరిశ్రమలు మూతబడిపోయాయి.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులకు, స్థానికులకు ఉపాధి సౌకర్యాలు తగ్గిపోయాయి.

ఒక్క ఉభయ గోదావరి జిల్లాలోనే 2.5 కోట్ల గుడ్లు ఎగుమతులు కాక వాటిని బయట పారవేయడమో లేక ఉచితంగా పంచే పరిస్థితులు వచ్చాయి.

తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకు నేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకప్రోత్సాహకాలు ప్రకటించాలి.

తెలుగు నేర్చుకుందాం:-ఆర్‌.వి శాస్త్రి, హైదరాబాద్‌

ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు అక్కడి భాషలను దైవ భాషలుగా పరిగణిస్తారు. ఆ భాషలు నేర్చుకొంటేనే వారు అక్కడ బతకగలరు. కొలువుల్లో చేరగలరు.

ఈ నేపథ్యం లో తెలుగు అభిమాని మోడీ మాత్రం కొత్త జాతీయ నియామక సంస్థను ఏర్పాటు చేశారు.

దీనిప్రకారం ఎక్కడ ఉన్న తెలుగువారైనా ఇక నుంచితెలుగులో పరీక్షలు రాయ వచ్చు.

కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియామక సంస్థలు, ప్రైవేట్‌ రంగ సంస్థలు ఈ పోటీ పరీక్షల ఫలితాలను వాడుకొంటాయి.

తమిళనాడులోని తెలుగు వారికి కూడా ఇక తెలుగు నేర్చుకోవడానికి ఇది మంచి ప్రోత్సాహం.

ప్రగతిని ద్వేషించవద్దు:-డా.దన్నాన అప్పలనాయుడు, చీపురుపల్లి

నేడు సాంఘికమైన వ్యత్యాసాలు సన్నగిల్లుతున్నాయి. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం పెరుగుతున్నది. కలిమి లేముల మధ్యసమతాభావానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంఘిక న్యాయంకోసం ప్రజానీకం పాటుపడుతున్నది.

సాంఘిక జీవి తాన్ని ప్రతిబింబించే రాజ్యాంగంలో బహుముఖంగా మార్పులు వస్తున్నాయి.పరాయి ప్రభుత్వం పనికిరాదన్నాం.రాచరికం కాద న్నాం.

నియంతృత్వం వీలుపడదన్నాం, ప్రజానీకపు ఆమోదం తో పరిపాలన జరిపే వ్యవస్థను కోరుకున్నాం.

నేడు లభ్యమైన విద్యాసౌకర్యాలు,రహదారులు,శ్రీఘగమనశక్తులు, సాంకేతికత, శాస్త్ర విజ్ఞానాలు మానవునకు అపూర్వమైన శక్తిని ప్రసాదిం చాయి.

ఈ శక్తులను సద్వినియోగపరచుకుంటే తనను సంకు చితపరిచే కట్టుబాట్ల నుంచి మానవుడు విముక్తి పొందగలడు. స్వేచ్ఛగా ప్రకృతి శక్తులతో సయ్యాటలాడగలడు. దీనికంతటికి సూత్రపాయుడు మానవుడు.

వృద్ధులను ఆదుకోవాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో నిస్సహాయులుగా ఉన్నఅసంఖ్యాక వృద్ధులను ఆదుకు నేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలుచేపట్టాలి.

స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా వయో వృద్ధుల పరిస్థితి దయనీయంగాఉంది.

వృద్ధుల నిత్యావసరాలు తీర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం, ఉచిత వైద్య సేవలు ప్రత్యేక హెల్ప్‌లైన్లు అమలు చేయాలి.

ఉద్యోగులు ఆలోచించాలి:-సి.శేఖర్‌, మహబూబ్‌నగర్‌

ఇప్పుడున్నప్రభుత్వాలు ప్రజలకుతాయిలాలు ఆశచూపెట్టడ మే అలవాలుగా మారింది.అది అనుభవిస్తున్న వారికి తెలుసు. రైతులకు మాత్రమే ఏదైనా చేయగలరు.

ఉద్యో గుల వయోపరిమితి60ఏళ్లు పొడిగిస్తే వారి పిల్లల భవిష్య త్తు ఏమవ్ఞతుందో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రావలసిన బకాయిలు లెక్కకు మించి ఉన్నాయి.

పి.ఆర్‌.సి అదేపుడూ పగటి కల. ఎలాగూ ఉద్యోగాలు లేక యువత అయోమయంలో రోడ్ల మీద తిరుగుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/