ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice of the People
Voice of the People

వెనుకబడిన జార్ఖండ్‌: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఒక రాష్ట్రంగా ఏర్పాటై 20 సంవత్సరాలు పూర్తయినా ఇప్ప టికీ జార్ఖండ్‌ రాష్ట్రంఆర్థికంగా సొంత అస్తిత్వాన్ని సంతరించు కోలేకపోవడం బాధాకరం. జాతీయ అభివృద్ధి సూచీలో 29 రాష్ట్రాల జాబితాలో జార్ఖండ్‌ రాష్ట్రం 265 స్థానంలో నిలబడ డం ఆ రాష్ట్రంఅభివృద్ధిలో ఎంతగావెనుకబడిందనేది సుస్పష్టం అవ్ఞతోంది. రాజకీయ అస్థిరత్వం ఆ రాష్ట్రాన్ని ఒడిదుడుకుల పాలు చేసిందనేది విస్పష్టం. బ్రహ్మాండమైన సహజవనరులు ఉన్నా తీవ్రమైన పేదరికంతో ఇబ్బందిపడుతున్న ఆ రాష్ట్రంలో ఇప్పటికైనా రాజకీయ సుస్థిరత ఏర్పడడం ఎంతో అవసరం. వివాదస్పద భూసమీకరణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా గిరిజనులకు ఎంతో అన్యాయం జరిగింది. 12 లక్షల మంది ఇందుమూలంగా భూములు కోల్పోయారు. అటవీహక్కుల చట్టం నిర్వీర్యమవుతోంది.

ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని సేకరించండి:-జి. విశ్వనాయక్‌, విజయవాడ

రాష్ట్ర ప్రభుత్వం రాబోయే విద్యాసంవత్సరంలో ఒకటి నుండి ఆరువ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకుగాను తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి తెలుగు మీడియం కావాలా? ఇంగ్లీష్‌ మీడియం కావాలా? అని వారి అభిప్రాయాన్ని సేకరించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రభుత్వా నికి అవసరంలేదా?పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు న్నారు? పాఠశాల భౌతిక పరిస్థితులేంటి? సాధ్యమా? అసా ధ్యమా? అనే విషయం ప్రజలకు తెలుస్తుందా? ఉపాధ్యాయు లకు తెలుస్తుందా? ప్రజల అభిప్రాయంతోపాటు ఉపాధ్యాయు ల అభిప్రాయం తీసుకోవాలి.

సినిమాలలో పెరుగుతున్న అనైతికత: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

నేటి సినిమాలలో విశృంఖలత్వం, అనైతికత, అసభ్యత నానాటికీ ఎక్కువవ్ఞతండడం దురదృష్టకర పరిణామం. హీరోలే స్వయంగా అమ్మాయిలను వేధించడం, వెటకా రాలు ఆడడం, దురుసుగా ప్రవర్తించడం, అమ్మాయిల అభిప్రాయాలతో సంబంధం లేకుండా దాడులకు దిగడం వంటి సంఘటనలను విరివిగా చూపిస్తున్నారు. యువతిపై బలమైన ప్రభావం చూపించే సినిమాలలో ఈ ధోరణినిచక్కదిద్దడం ఎంతో అవసరం.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

మహిళలపై అత్యాచారాలు,హత్యలు అప్రతిహతంగా కొనసాగు తుండడంపై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. నిర్భయ చట్టం వచ్చినా మృగాళ్ల అత్యాచార పర్వాలకు హద్దుపద్దు లేకుండా పోతోంది. న్యాయం జరగడంలో విపరీతమైన జాప్యం, ఎలా గైనాసత్వర న్యాయం జరగాలన్నవాదన బలంగా వినిపిస్తోంది. అయితే అన్ని రాష్ట్రాలలోనూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుతో అత్యాచారాల కేసులను వెంటవెంటనే పరిష్కరించాలన్న సుప్రీం కోర్టుఆదేశాలు బేఖాతరు అవ్ఞతున్నాయి.కేంద్రప్రభుత్వం 1750 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసి అందుకోసం 500 కోట్లు బడ్జెట్‌ కేటాయించింది.2005లో మరొక510కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే నిర్వహణ వ్యయాన్ని భరించలేక 11 రాష్ట్రాలు ఆ బాధ్యత నుండి తప్పుకున్నాయి. 2019 జూన్‌ నాటికి 580 కోర్టులు మాత్రమే మిగిలాయి. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా కోర్టుల ఏర్పాటు ఊసేలేదు. ప్రజ లలో అసంతృప్తి పెచ్చుపెరుగుతున్నా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు నిర్లప్తవైఖరి వహిస్తుండడం బాధాకరం.

పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి: -డి.రమాదేవి, విశాఖపట్నం

నేటి పాఠశాలల్లో సిలబస్‌ అనేది మారుతున్న కాలానికి అను కూలంగాఉండాలి. కఠినమైన లెక్కలు,థియరీలుఇస్తే విద్యార్థులకు అర్థంకాదు. పైగా బోధకుల ఒత్తిడి తట్టుకోలేక పాఠశాలలకు కళాశాలలకు డుమ్మాకొట్టే అవకాశం ఉంది. కనుక సరళమైన లెక్కలు, పాఠాలు, నిజజీవితంలో పనికివచ్చే పాఠాలు, మాన వతా విలువలు, మోరల్‌సైన్సు పాఠాలు, నలుగురితో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి అనే అంశాలు పాఠాలలో ఉండాలి. కఠినమైన పాఠాలు ఉంటే చదవలేక విద్యార్థులు చదు వ్ఞ మధ్యలోనే మానేసే అవకాశం ఉంది. పిల్లలపై ఒత్తిడి లేకుండా ఆడుతూపాడుతూ చదువ్ఞకునే విధంగా సిలబస్‌ను మార్చాలి. నైతిక విలువలు నేర్పేలా చదువ్ఞలు ఉండాలి.

బావులలో ఈతను నిషేధించాలి: -ఆమంచర్ల ఉష, తిరుపతి

పల్లెలు, గ్రామాలలో దిగుడు బావులు, పెద్దపెద్ద బావ్ఞలలో పిల్లలు కేరింతలతో ఈతకొడుతూ నీట మునుగుతున్నారు. కొంతమంది పిల్లలు ఈత కోసమని వెళ్తూ తమ ప్రాణా లను పోగొట్టుకుంటున్నారు.యుద్ధప్రాతిపదికన బావ్ఞలపైన కమ్మిలు ఏర్పాటుచేయాలి. నిషేధిత బోర్డులు పెట్టాలి. ఆ నీటిని పొలాలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి : https://epaper.vaartha.com/